
ఆంధ్ర ప్రదేశ్ ఫార్మసీ కౌన్సిల్లో ఫార్మసిస్ట్ గా రిజిస్ట్రేషన్ లేదా రెన్యువల్ కు దరఖాస్తు చేసి సంవత్సరాల తరబడి ఎదురుచూస్తున్నారా… ?
సంప్రదించినా కూడా ఫార్మసీ కౌన్సిల్లో మీరు చేసుకున్న దరఖాస్తు యొక్క స్టేటస్ మీకు ఎవరూ చెప్పడం లేదా ?
కంగారు పడాల్సిన అవసరం లేదు ఈ క్రింది ఆర్టీఐ దరఖాస్తు ఫారంని డౌన్లోడ్ చేసుకుని మీ రిజిస్ట్రేషన్ లేదా రెన్యువల్ దరఖాస్తు ప్రక్రియ ఎంతవరకు వచ్చిందో తెలుసుకోండి. చట్ట ప్రకారం సమాచారం పొందడం మీ హక్కు.
మీరు చేయాల్సిందల్లా ఈ క్రింద ఇవ్వబడిన సమాచార హక్కు దరఖాస్తు పత్రాన్ని డౌన్లోడ్ చేసుకుని, ఫారం ను మీ డీటెయిల్స్ తో నింపి, స్థానిక పోస్ట్ ఆఫీస్ లో రూ. 10/- పోస్టల్ ఆర్డర్ ఒకటి తీసుకుని, ఈ క్రింది ఫోటోలలో చూపిన విధంగా నింపి, ఈ దరఖాస్తుకు జత పరిచి, రిజిస్టర్ పోస్టు ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి పంపించగలరు. వారం నుండి 15 రోజులలోగా మీకు మీ దరఖాస్తు యొక్క సమాచారం ఫార్మసీ కౌన్సిల్ నుంచి వస్తుంది.
